మౌనం గొప్పదే కాదనలేం
కానీ మాటలు లేకుండా..
మాట్లాడకుండా
ఎలా ఉండగలం ?
మాటలు కొండంత
అండను ఇస్తాయి
చెరిగిపోని స్పూర్తినిస్తాయి
మన ఎడతెగని సంచారంలో
ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి
అప్పుడే వాటి విలువ తెలుస్తుంది
మనకు లేకపోతే అర్థమవుతుంది
మాటలకున్న మహత్తు ఏమి
గుండెల్ని మీటేది మాటలే
గుప్పిట బిగించేది మాటలే
గువ్వలా ఒదిగి పోయేది మాటలే
మాటలు మనసు దోచేస్తాయి
హృదయాల మీద పూల సంతకం చేస్తాయి
ఏదీ లేకపోయినా బతకొచ్చు
కానీ ఇష్టమైన వారితో మాట్లాడకుండా ఉండలేం
అనుబంధాలను కలిపేది మాటలే
బంధాలను తెంచేది మాటలే
తనివి తీరా ఏడవాలి ..ఏడిచాకా మాట్లాడాలి