రోజులు మన జ్ఞాపకాల
మీదనుంచి
దొర్లుకుంటూ పోతున్నాయి
జీవితం గజిబిజి
గందరగోళం అయింది
గానుగెద్దుకు తగిలించిన
కాడెంలా బారంగా
అంతా సవ్యంగా
ఉన్నట్టే ఉంటుంది
అంతలోనే ఎక్కడో
ఏదో రాగం శృతి తప్పినట్టు
మరేదో గానం
మూగబోయినట్టు
ఏమూలో అసంతృప్తి
సెగ రాచుకుని
మనసంతా నిప్పుల
సెగై రగులుతోంది
నా మనసు అటు
చివర్నుంచి
నీమనసు
మొదటివరకు వేసిన
వారధిని కూల్చేశావు నీవే
ఇప్పుడు చూస్తే అన్నీ
ఆనవాళ్ళే తప్పించి
నీదరిచేరేందుకు దారే
కనిపిచడంలేదు
నీవు కూల్చేసిన జ్ఞాపకాల
శిధిలాలను దాటుకొని
రావాలని చూసిన ప్రతిసారి
పైనుంచి రాళ్ళేస్తున్నావు
నా మనసుకు గాయాలు అవ్వాలని
నేను నీదరికి చేరకూడదని ..
ఎందుకలా చేస్తున్నావో
ఒక్కోసారి కల్లముందే
కనిపిస్తుంది గమ్యం
కనికరం లేకుండా పరుగులు
పెడుతున్నా మనస్సు
నిచ్చెన చివరి మెట్టు
చేరాలనుకొని చేస్తున్న
ప్రయత్నాలన్నీ
విఫలం అవుతున్నాయి
కాదు కాదు చేస్తున్నావు
ఆ అపజయం మరో
పరాజయంలా పరిహాసం చేస్తున్నట్టు,
తమని తాము చూసుకోలేని కళ్ళు
అద్దంలో మసగబారినట్టు
మనసుని కమ్మేస్తాయి కన్నీరు
కంటినిండా కన్నీటితో
నేను గమ్యించేరేదెప్పుడులే
చేరాలనుకున్నా చేరనీయవుగా..
Ur So Great Kada Dear
మీదనుంచి
దొర్లుకుంటూ పోతున్నాయి
జీవితం గజిబిజి
గందరగోళం అయింది
గానుగెద్దుకు తగిలించిన
కాడెంలా బారంగా
అంతా సవ్యంగా
ఉన్నట్టే ఉంటుంది
అంతలోనే ఎక్కడో
ఏదో రాగం శృతి తప్పినట్టు
మరేదో గానం
మూగబోయినట్టు
ఏమూలో అసంతృప్తి
సెగ రాచుకుని
మనసంతా నిప్పుల
సెగై రగులుతోంది
నా మనసు అటు
చివర్నుంచి
నీమనసు
మొదటివరకు వేసిన
వారధిని కూల్చేశావు నీవే
ఇప్పుడు చూస్తే అన్నీ
ఆనవాళ్ళే తప్పించి
నీదరిచేరేందుకు దారే
కనిపిచడంలేదు
నీవు కూల్చేసిన జ్ఞాపకాల
శిధిలాలను దాటుకొని
రావాలని చూసిన ప్రతిసారి
పైనుంచి రాళ్ళేస్తున్నావు
నా మనసుకు గాయాలు అవ్వాలని
నేను నీదరికి చేరకూడదని ..
ఎందుకలా చేస్తున్నావో
ఒక్కోసారి కల్లముందే
కనిపిస్తుంది గమ్యం
కనికరం లేకుండా పరుగులు
పెడుతున్నా మనస్సు
నిచ్చెన చివరి మెట్టు
చేరాలనుకొని చేస్తున్న
ప్రయత్నాలన్నీ
విఫలం అవుతున్నాయి
కాదు కాదు చేస్తున్నావు
ఆ అపజయం మరో
పరాజయంలా పరిహాసం చేస్తున్నట్టు,
తమని తాము చూసుకోలేని కళ్ళు
అద్దంలో మసగబారినట్టు
మనసుని కమ్మేస్తాయి కన్నీరు
కంటినిండా కన్నీటితో
నేను గమ్యించేరేదెప్పుడులే
చేరాలనుకున్నా చేరనీయవుగా..
Ur So Great Kada Dear