. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Sunday, October 6, 2013

చలం కలం నుండి జాలువారిన ఓ "ప్రేమ లేఖ.(2)



సృష్టిదైన విరహబాధ తన మాధుర్య భారం వల్ల తనే పగిలి , మనిద్దరినీ కన్నది. జనన మప్పుడు మాత్రమే ఆ ఒక్క ముహూర్తమే మనమైక్యమై ఉన్నది .జన్మ మాధుర్యంలో సోలిన మన చేతుల్ని చిరునవ్వుతో విడదీసి , మేఘశయ్యల మీద ఆనించి ప్రేమ గీతాలు పాడుతూ నక్షత్ర మార్గాల నూరేగించి , ఇద్దరి మధ్యనూ అగాధమైన వ్యవధిని కల్పించి , ఈలోకంలో వొదిలారు . నా నోటి నుంచి వచ్చిన మొదటి శబ్దం , పేరు లేని నీ పేరు. మూర్ఖులు వీళ్ళు , అది పాలకోసం యేడుపనుకొన్నారు .
అది మొదలు నీ కోసం వెతుకుతున్నాను . నేనాడుకొన్న బొమ్మల్లో నీ ఉన్నావేమోనని వెతికాను . నేను చదువుకొన్న పుస్తకాల్లో నీ రూపం ముద్రించారేమోనని చూసాను. కవులు నీ అందాన్ని పాడారేమోనని చదివాను. నీవెక్కడన్నా కనపడతావేమోనని మొహాలు వెతుకుతూ , దేశాలు తిరిగాను .
కనపడవు . కాని నాకు నీవు చిరపరిచయవు. నీ రూపమగొచరము , నీ స్వభావము మనోభావాని కతీతము . కాని నీకన్నా నాకు హృదయానుగత మేదీ లేదు . నీ నామ మనుసృతము. కలలో విన్న గానం వలె ప్రతి నిమిషమూ నా చెవుల ద్వనిస్తోఒది. నా వైపు నడిచి వచ్చే నీ మృదు పాదరజము అస్తమయ మేఘాలకి ఎఱ్ఱని రంగు వేస్తోంది. నన్ను వెతుకుతో వచ్చే నీ అడుగుల చప్పుడు నా హృదయం లో ప్రతి నిమిషము ద్వనిస్తోంది, నా పరమావధి నీవు .
నీ వుండబట్టి , ఈ ప్రపంచమింత సుందరమూ , హృదయాకర్షమూనూ నాకు. కాకపోతే ఈ కొత్త లోకానికి నాకు సంబంధమేమిటి? లోహపు బిళ్ళల్ని, నీతి ప్రతిష్టల్నీ ఆరాధించే ఈ ప్రజలతో నాకు సాపత్యమేమిటీ ? వీరెవరో నాకు తెలియదు. నేను వీరి కర్థం కాను, నేనిట్లా యెందుకు వెతుకుతున్నానో ఊహించలేరు ..