ఒక్కసారి ఒకే ఒక్కసారి, ఈ ముసుగులన్నీ తీసి పక్కన పెట్టి……”నేను బాగానే ఉన్నానులే”, అన్న ముసుగు కూడా తీసేసి,మనసు లోతుల్లో ఆణువణువూ స్పృశిస్తూ, “సంతోషంగా ఉన్నానా?”, అని గొంతెత్తి అరిస్తే బండరాతి గుండెల మధ్య పలుమార్లు ప్రతిధ్వనించి ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అదే ప్రశ్న.బండరాయి పగుళ్ళ శబ్దం తప్ప ఎమైనా సమాధానం వస్తుందా ? మనకు మనం మంచివాళ్లమనే ముసుగు కప్పుకొని... స్వార్దంగా నో సంతోషాన్ని మాత్రం మే సూసుకొని ఎదుటి వాళ్ళేమైనా పట్టించుకోని నీ మనస్సాక్షిలో దాగిన నీజాలను అడుగు ..అడగలేవు పైకి నటిస్తున్నావు నేను మంచే చేస్తున్నా అని నీ మనస్సాక్షి కాదన్న వద్దన్నా పట్టించుకోకుండా నీ మనసుకు ముసుగులు కప్పీ కప్పీ ఊపిరాడకుండా చేసి ప్రాణం తీసిన గుండె కదూ?…. పాపం ఎండిపోయింది…..ఒక్కసారి ముసుగులన్నీ తొలిగేటప్పటికి, మళ్లీ ఊపిరి పిల్చుకోవాలని ప్రయత్నం. కొన ఊపిరి అందగానే ఏదో ఆనందం…నగ్నత్వంలో స్వచ్ఛతలాగా…స్వచ్ఛత సువాసనను వెదజల్లే స్వేఛ్చను ఊపిరిగా పీల్చుకుంటూ మళ్లీ ప్రాణం పోసుకుంటున్న గుండె స్పందించటం మొదలు పెట్టింది... ఆ స్పందనలో ధనం, దర్పం, అధికారం ఏమీ లేవు….స్వచ్ఛత తప్ప…గుండెల నిండా ఊపిరి పీల్చి వదిలే సరికి, సుదూరంగా అలజడి శబ్దం. లోకం శరవేగంతో పరుగులు పెడుతుంది, సునామీ కాలం వెంబడిస్తున్నట్టు…తిరిగి ముసుగులు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. మనసు ఒప్పికోవట్లేదు…సునామి తరుముకొస్తుంది…ఓ ముసుగును అక్కడే వదిలేసి మిగతావన్నీ తగిలించుకుని లోకంతో పాటు పరుగులు...ఏ అలిసిన క్షణానో మరోసారి ఈ ఒకే ఒక్కసారి అంటూ ముసుగులు తొలిగించకపోతానా……మరో సంఖ్య తగ్గించుకోకపోతానా… అందరి దృష్టిలో నీవు మాత్రం గొప్ప.. నిజాయితీకి నిలువుటద్దం అంటూ చెప్పకనే చెప్పుకుంటావు నీ ఇగోను సాటిస్ ఫైచేస్తూ..స్వార్దగా ఆలోచిస్తూ...ఎక్కడ ఎవరు నిన్ను తప్పుగా అనుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ ఎవ్వరూ చూడట్లేదని నిజాన్ని నిలువునా తగులబెట్టి వెర్రినవ్వులు నవ్వుకుంటున్నావు ఏదో విజయంసాదించాను అని ... ఎవ్వరూ చూడకపింఓయిన అన్నిటికీ నీ మనస్సాక్షే అన్నికీ సాక్ష్యం అయినా ఏం తెలియనట్టు అయాకంగా నటించడం నేర్చుకున్నావుగా అప్పుడలా ఇప్పుడిలా నిన్ను చూస్తుంటే నీవేనా అనిపిస్తుంది కాని నిజంకదా నమ్మక తప్పదు ... కళ్ళెదురుగా జరిగే నిజాలు మరి నీవు చీకట్లో చేశాను అనుకున్నా నిజానికి వెలుగు చీకట్లుండవన్న నిజం తెల్సుకునే సమయం ఆలోచన నీకు లేదు...ప్లీజ్ ఇంక నటించకు మంచి అనే ముసుగు తీసి.. నీవు నీవులాగా ఉండు..నీలో స్వచ్చత ఉంది ఆ స్వచ్చతను స్వార్దం తినేస్తుంది . నీలో ఉన్న అంతరంగ అందం చెడి పోతుంది.. నీవు మారకు నీవు నీవులాగా ఉండి నీలో నీవు ఓడిపోకు క్షనకాలపు ఆనందపు పొగడ్తలకోసం ఆరాటపడుతున్నావు కాని అదోపాతాలానికి దిగజారిపోతున్నావని తెల్సుకోలేకపోతున్నావు..నీకు తెలివిలేక కాదు తెల్సుకోలేక..పై పై మెరుగులే కావాలి నీకు ఇప్పటీకైనా నటించడం మానీ నిక్కచ్చిగా జీవిండం నేర్చుకో .. నీలాగానే ఉండు..నిన్ను నీవు మార్చుకొని ఏమార్చుకోకుపైకి అందరూ నిన్ను పొగుడుతున్నా లోపల నీన్ను చులకనగా చూస్తున్నారు.. నీఎదురుగా మాట్లాడంకాదు నీవు లేనప్పుడు కూడా నిన్ను నిన్నుగా గుర్తించేలా చేసుకో