ఏవేవో ఆలోచనలు
చుట్టూ వినిపిస్తున్న
అక్షరాల ఆక్రందనలు
అల్లిబిల్లిగా అల్లేసుకుని
పీటముడి పడిపోయాయి
చిక్కులు విప్పుదామని
చెయ్యి దూరిస్తే
చల్లగా ఏదో తాకింది
చూస్తే ఎర్రటి రక్తం
ఎవర్ని ఎవరొ పొడిస్తే వచ్చింది
కస్సుమన్న శబ్దంతోనే పౌంటెన్లా
ఎగిసిపడ్డ రక్తం
మనసు స్రవిస్తోన్న సిరా గా
లో అక్షరాలుగా మారిపోయి
ఈ చిత్తు కాగితాన్ని అలికేసింది…..
అలికిడిలో వచ్చిన అక్షరాలే ఇవి
చదువుతుంటే గజిబిజిగా అనిపించినా
మనసు లోతుల్లోంచి తీసిన
పాత ఇనుములాంటీ జ్ఞాపకాలు
నాకు ఇసుమంత టైం ఇస్తే
అన్నీ నీ కాళ్ళదగ్గర పేరుస్తా
చదివిచూడు..నాహృదయంపడే
వేదన శబ్దాలు వినిపిస్తాయి
వినవు వినలేవు ఎందుకంటే
ఆమనసే ఉంటే ఇదంతా ఎదుకు కదా....?
చుట్టూ వినిపిస్తున్న
అక్షరాల ఆక్రందనలు
అల్లిబిల్లిగా అల్లేసుకుని
పీటముడి పడిపోయాయి
చిక్కులు విప్పుదామని
చెయ్యి దూరిస్తే
చల్లగా ఏదో తాకింది
చూస్తే ఎర్రటి రక్తం
ఎవర్ని ఎవరొ పొడిస్తే వచ్చింది
కస్సుమన్న శబ్దంతోనే పౌంటెన్లా
ఎగిసిపడ్డ రక్తం
మనసు స్రవిస్తోన్న సిరా గా
లో అక్షరాలుగా మారిపోయి
ఈ చిత్తు కాగితాన్ని అలికేసింది…..
అలికిడిలో వచ్చిన అక్షరాలే ఇవి
చదువుతుంటే గజిబిజిగా అనిపించినా
మనసు లోతుల్లోంచి తీసిన
పాత ఇనుములాంటీ జ్ఞాపకాలు
నాకు ఇసుమంత టైం ఇస్తే
అన్నీ నీ కాళ్ళదగ్గర పేరుస్తా
చదివిచూడు..నాహృదయంపడే
వేదన శబ్దాలు వినిపిస్తాయి
వినవు వినలేవు ఎందుకంటే
ఆమనసే ఉంటే ఇదంతా ఎదుకు కదా....?