ప్రియా నీజ్ఞాపకాలు
మబ్బులా కమ్ముకుంటాయి
వెంటనే కన్నీరు
ఏకధాటిగా బయటకు పరుగులు తీస్తాయి
నీ తలపులు గుర్తొచ్చిన ప్రతిసారి...
నా కళ్ళు ఏకధాటిగా ఇలా వర్షిస్తాయి!
కంటి నిండా కలలున్నాయి...
అవి ఎప్పటికి తీరవేమో
ఎప్పటికీ తీరందాటని ఉప్పెనలా
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి
ఏదో రాయాలని విఫల ప్రయత్నం చేస్తుంటా
ఎందుకో ఒక్కోసారి అక్షరాలు కనిపించకుండా
కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...ప్రియా
అందుకే దేవుడా
నిజంగా నీవు దేవుడవైతే..
ప్రియను దరి చేర్చలేవని తేలింది అందుకే
నా గుండెను రాతి బండను చేయి...
పగిలి పోయిందనుకో ఆ రాయి...
నన్ను మట్టిలోకల్సిపోయేలా చేయి
భగవంతుడా నీవు నాకు
ఈ ఒక్క సహాయము చేయి...
నీవు దమ్మున్న దేవుడవైతే....?
మబ్బులా కమ్ముకుంటాయి
వెంటనే కన్నీరు
ఏకధాటిగా బయటకు పరుగులు తీస్తాయి
నీ తలపులు గుర్తొచ్చిన ప్రతిసారి...
నా కళ్ళు ఏకధాటిగా ఇలా వర్షిస్తాయి!
కంటి నిండా కలలున్నాయి...
అవి ఎప్పటికి తీరవేమో
ఎప్పటికీ తీరందాటని ఉప్పెనలా
నీవు గుర్తొచ్చిన ప్రతిసారి
ఏదో రాయాలని విఫల ప్రయత్నం చేస్తుంటా
ఎందుకో ఒక్కోసారి అక్షరాలు కనిపించకుండా
కన్నీటి పొరలు అడ్డొస్తున్నాయి...ప్రియా
అందుకే దేవుడా
నిజంగా నీవు దేవుడవైతే..
ప్రియను దరి చేర్చలేవని తేలింది అందుకే
నా గుండెను రాతి బండను చేయి...
పగిలి పోయిందనుకో ఆ రాయి...
నన్ను మట్టిలోకల్సిపోయేలా చేయి
భగవంతుడా నీవు నాకు
ఈ ఒక్క సహాయము చేయి...
నీవు దమ్మున్న దేవుడవైతే....?