నా మనసుని ఎందుకిలా వేధిస్తావు
నా కలలని ఎందుకిలా కాజేసావు
నా ఆవేదన నీకోసం పరితపిస్తోంది
నా ఆలోచన నీ చుట్టూ కదుల్తోంది
ఒక క్షణం నీ రూపం మరో క్షణం నీ
మాట ఇంకో క్షణం తియ్యని మాట
మరుక్షనం నా భాదలో నీవిచ్చిన ఓదార్పు
నేను నీ గూర్చి ఆలోచించని క్షణం నా
పలుకు నా ఉలుకు నీ చూపు కోసం
ఎక్కడెక్కడో తడుముతాయి
ఎలావున్నావంటూ ఆందోళన చెందుతాయి
కాని నీవు నాఊసే మర్చి హేపీగానే ఉన్నావుగా
నమ్మావా రోజు నాకళ్ళు అనుక్షణం
నాతో మాట్లడుతాయంటే తెలిసిందా
నీ చూపుల భాష నాకు మాత్రమే తెలుసనీ
ఆబాషను అర్దం చేసుకునే మనస్సు నాదొక్కటేని
నీమనస్సుకు తెలుసు కాని ఎందుకో నీవిలా..?
మనం ఊసులాడుకున్న
పదాలన్నీ నీ పెదాల మాటున దాచి
కలలన్నీ నీ రెప్పల చాటున వుంచి
వదలలేక కదలలేక నీ అడుగు
కదిలిందనీ నాకు తెలియదాప్రియా
నా కలలని ఎందుకిలా కాజేసావు
నా ఆవేదన నీకోసం పరితపిస్తోంది
నా ఆలోచన నీ చుట్టూ కదుల్తోంది
ఒక క్షణం నీ రూపం మరో క్షణం నీ
మాట ఇంకో క్షణం తియ్యని మాట
మరుక్షనం నా భాదలో నీవిచ్చిన ఓదార్పు
నేను నీ గూర్చి ఆలోచించని క్షణం నా
పలుకు నా ఉలుకు నీ చూపు కోసం
ఎక్కడెక్కడో తడుముతాయి
ఎలావున్నావంటూ ఆందోళన చెందుతాయి
కాని నీవు నాఊసే మర్చి హేపీగానే ఉన్నావుగా
నమ్మావా రోజు నాకళ్ళు అనుక్షణం
నాతో మాట్లడుతాయంటే తెలిసిందా
నీ చూపుల భాష నాకు మాత్రమే తెలుసనీ
ఆబాషను అర్దం చేసుకునే మనస్సు నాదొక్కటేని
నీమనస్సుకు తెలుసు కాని ఎందుకో నీవిలా..?
మనం ఊసులాడుకున్న
పదాలన్నీ నీ పెదాల మాటున దాచి
కలలన్నీ నీ రెప్పల చాటున వుంచి
వదలలేక కదలలేక నీ అడుగు
కదిలిందనీ నాకు తెలియదాప్రియా