క్షణ క్షణం అనుక్షణం నిరీక్షణం
నీకోసం ఈ ఆవేశం
ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ఇన్నాళ్ళుగా
ఎదురుచూసి అలసి సొలసి సొమ్మసిల్లి
పడిపోయా !
మరువరాని మరపురాని క్షణాలను
తలచి తలచి దుఖిస్తూ
నిర్జీవమైన దేహంతో
అంతులేని అనంతమైన
శూన్యంలో రెప్పపాటు
దుఖంతో
మూలుగుతూ మ్రుక్కుతూ
నీకోసం ఆలోచిస్తూ అన్వేషిస్తూ
నిరీక్షిస్తూ నిట్టుర్పు విడుస్తూ
భాధతో వ్యధతో నీకోసం....