ప్రియా నేను అన్న పదాన్ని మరిచా
నిన్ని వెతులాటలో
మది కలవరింత
దిగాలుగా ఉన్నా
ఓదార్చే వారు లేక
ప్రియా అక్షరాలన్నీ భారం అయ్యాయి
మనసు రోదనలో
గజిబిజిగా మారిన అక్షరాలు
పదాలు అర్దం మారుతున్నాయి
నీలో నన్ను వెతుక్కోవాలని చూశా
ఆ ప్రయత్నంలో విఫల అయ్యా
విధి చేతిలోనే కాదు
నీ అవమానంలో
ఇప్పుడు కాలిపోతున్నా ప్రియా
ప్రియా ఇంకా కాలిపోతూనే ఉన్నా
మంటలు నన్ను
ఎప్పుడొ కమ్మేశాయి
నాలో ప్రతి అవయవం
కాలి పోతోంది
ఉడుకుతున్న నా అవయవాలు
మాంసపు ముద్దలు గా మారుతున్న క్షనం
అయినా నీలో చలనం లేదు.
ప్రియా ఎవరికోసమో వెతుకుతున్నావు
నీవు నాకోసమా..?
ఆ ఆలోచనే నన్ను నవ్విస్తోంది
ఒకప్పుడు నీకోసం
ఆత్రం గా వెతికే వాన్ని
నీతో మాట్లాడాలని
నీతో ఏవేవో ఊసులు పంచుకోవాలని
కాని ఇప్పుడు..నీవంటే భయం
ఎక్కడ అవమానిస్తావొ
ఎవరి సమక్షంలో
నన్ను వెర్రివాడిని చేస్తావొ.
.
నన్ను ఎన్ని సార్లు
అవమానిస్తావు ప్రియా
గుండె పగిలినా ..మనసు రగిలినా.
ఇప్పుడు కాలిపోతున్న కావ్యాన్ని
కాలీపోతున్న నాదేహంలో
ఎముకలన్నీ బూడిదై
కుప్పగా కూలిపోతున్నా
ప్రియా దూరంగా చిరునవ్వులు నవ్వుతూ నీవు
మరొకరి సమక్షంలో
ఇప్పుడు నీదృష్టీలో నేను
చెత్త కాగితాన్ని కదా ప్రియా ..?
నిన్ని వెతులాటలో
మది కలవరింత
దిగాలుగా ఉన్నా
ఓదార్చే వారు లేక
ప్రియా అక్షరాలన్నీ భారం అయ్యాయి
మనసు రోదనలో
గజిబిజిగా మారిన అక్షరాలు
పదాలు అర్దం మారుతున్నాయి
నీలో నన్ను వెతుక్కోవాలని చూశా
ఆ ప్రయత్నంలో విఫల అయ్యా
విధి చేతిలోనే కాదు
నీ అవమానంలో
ఇప్పుడు కాలిపోతున్నా ప్రియా
ప్రియా ఇంకా కాలిపోతూనే ఉన్నా
మంటలు నన్ను
ఎప్పుడొ కమ్మేశాయి
నాలో ప్రతి అవయవం
కాలి పోతోంది
ఉడుకుతున్న నా అవయవాలు
మాంసపు ముద్దలు గా మారుతున్న క్షనం
అయినా నీలో చలనం లేదు.
ప్రియా ఎవరికోసమో వెతుకుతున్నావు
నీవు నాకోసమా..?
ఆ ఆలోచనే నన్ను నవ్విస్తోంది
ఒకప్పుడు నీకోసం
ఆత్రం గా వెతికే వాన్ని
నీతో మాట్లాడాలని
నీతో ఏవేవో ఊసులు పంచుకోవాలని
కాని ఇప్పుడు..నీవంటే భయం
ఎక్కడ అవమానిస్తావొ
ఎవరి సమక్షంలో
నన్ను వెర్రివాడిని చేస్తావొ.
.
నన్ను ఎన్ని సార్లు
అవమానిస్తావు ప్రియా
గుండె పగిలినా ..మనసు రగిలినా.
ఇప్పుడు కాలిపోతున్న కావ్యాన్ని
కాలీపోతున్న నాదేహంలో
ఎముకలన్నీ బూడిదై
కుప్పగా కూలిపోతున్నా
ప్రియా దూరంగా చిరునవ్వులు నవ్వుతూ నీవు
మరొకరి సమక్షంలో
ఇప్పుడు నీదృష్టీలో నేను
చెత్త కాగితాన్ని కదా ప్రియా ..?