ఆ రోజులు గుర్తొస్తే
సంతోషం లాంటి విచారం కలుగుతుంద
"ఆ రోజులు గుర్తొస్తే సంతోషం లాంటి విచారం కలుగుతుంది......
" జ్ఞాపకాలు బాగా దయలేనివి, చాలా పదునైనవి
గుండెను అనునిత్యం రంపాలై కోసేస్తుంటాయి...
బాధను దిగమింగే ప్రయత్నంలో
బ్రతుకులు చీతిమంటలై కాలి పోతుంటాయి....!
ఒక ప్రయత్నం విఫల మన్న నిజం
మనసుని సూతిమెత్తగా అనునిత్యం శిక్షిస్తుంది......
ఏది చేయాలో తోచని
నేను,దేహం ఫుట్ పాత్ మీద అనాధ శవాన్నై వాలిపోతుంటాం....
ఇక అనుభూతుల పరంపర అమ్ముడుపొని దినపత్రికలా...
మిగిలిపోతుంది
కనిపించక అనిపించే చావేదో ఆత్మహత్యను మరిపిస్తూవుంటది