నీ ఆలోచనలను అంతం చేద్దాం అంటే
జ్ఞాపకమై మళ్ళి పుడుతున్నావు
తిరిగి రాని గతాన్ని నేనయితే
మరపురాని జ్ఞాపకానివి నువ్వు
బావమెరుగని మాటను నేనైతే
భాషకందని మౌనానివి నీవు
మౌనపు సంద్రానికి
చెరో ఒడ్డునా నిలిచిపోయాము..
ఎందుకో ఎప్పటికీ కలువలేని నింగీ నేలలా
నీ మాటలతో నన్ను పిలవక పోయినా
నీ హృదయంలో నన్ను నిలువక పోయినా
నీ కోసం నీ పిలుపు కోసం ఎదురు చూస్తూనే ఉంటాను