Sunday, October 14, 2012
మదిని మర్చి మనసును ఏమార్చి..గుండెళ్ళో గుచ్చావు
ఎవరు నీవు నాకేం అవుతావు
ఎందుకొచ్చావు నాజీవితంలోకి
నేను నిన్ను రమ్మని అడగలేదే
నా మనస్సులో దూరమని బ్రతిమిలాడలేదే
నా భాదలు పంచుకొని ఓదర్చి నట్టు నటించావు
నీపరిచయమే వింత.. నీ ప్రవర్తన మరో వింత..
భాదల్లో ఉన్ననీవు ఓదార్పులావచ్చి
కడలిలో కన్నీళ్ళను తరచి..తలపులు మార్చి
ఊహలు ఊరించి ఆశలు రేపి అదోపాతానికి నేట్టావు
మదిని మర్చి మనసును ఏమార్చి..గుండెళ్ళో గుచ్చావు
గూడుకట్టుకున్న ఆశలు రేపి.
రయ్యిమంటూ ఎగిరిపోయావు
నీ కన్నుల్లో నిజాయితీ లేదు
నీ మాటలు మొత్తం మాయనే
చెప్పే మాటల్లో ఒక్కటీ నిజాయితీ లేదు
నన్ను చంపటానికి నీవు పుట్టావేమో
నా చావు కోరటానికి వచ్చిన అందాల రాక్షసి నీవు
ఒకప్పుడు నీతో మాట్లాడాలని మనస్సు తహ తహ లాడేది
నీవు చెప్పిన మాయా మాటలు ఇప్పుడు నీ చేష్టలు
మనస్సు నిన్నే కోరుకుంటున్నా..
తనువు నీకు దూరంగా పారిపొమ్మంటుంది
నన్ను భాదపెట్టి ఏంసాదించావో
నన్ని గుండెళ్ళో గుచ్చి ఏంసాదించావు
మనిషిని ఈలోకంనుంచి శాశ్వితంగా
పోవడానికి నీవేకారణం నీకిప్పుడు సంతోషమా
ఎందుకు దేవున్ని పూజిస్తా దండగ..
మరో మనిషిని మానసికంగా చంపి
మన్సును ఏమార్చి ..ఏం సాదించావు ప్రియా