Tuesday, October 2, 2012
ప్రేమించినందుకు ... నిన్ను ప్రాణం కంటే ఇష్ట పడ్డందుకు అవమానించావు
నీవు అవును అన్నా కాదన్నా నేను నిన్ని ప్రేమిస్తూనే ఉంటా
నిన్ను నేను ప్రేమించమని చెప్పలేదే ఎందుకు ఉలిక్కి పడతావు
ఒకప్పుడు నీవే అన్నావు తరువాత నీవెక్కడ నేనెక్కడ అన్నావు
అన్నీ నీమాటలే...మాట మారుస్తావని అనుకోలేదు నేను
నేనెప్పుడు ఒకే మాట.. మాట తప
్పను నీలా
మనసులో ఒకరకంగా బైట ఒకరకంగా మాట్లాడను నీలా
ఎందుకు నన్నొక్కడినే దోషిని చేశావు,, నిన్ను నీవు ప్రశ్నించుకో
నేనేంటో తెల్సి... నీవలా ఎలా అనగలిగావు...
నీవు నమ్మిన వాళ్ళు నిన్ను అవమాణించిన రోజు
నేనేంటో తెలుస్తుంది ..ఆరోజు దగ్గరలో ఉంది
వాళ్ళు ఎలాంటి వాళ్ళో చెబితే నన్నే అవమానించావు
చివరకు .. గుండెళ్ళో కత్తుల్లాంటి మాటలతో భాదించావు
అయినా నీమీద ఇసుమంతైనా ప్రేమ తగ్గలేదు
నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
ఒకప్పుడు నీపేరు తలస్తే మురిచి పోయావు
ఇప్పుడు.. మండుతుందని నాగుండెను మండించావు
నన్ను భాదపెట్టి ఏంసాదించావో తెలీదు..
ప్రేమించినందుకు ... నిన్ను ప్రాణం కంటే ఇష్ట పడ్డందుకు
నన్ను అవమానించావు.. భాదపెట్టావు
నీ పేరు పలికితే మండుద్ది అన్నావు.. అలా ఎలా అనగలిగావు
నీవు చాలా గ్రేట్ ఇలా అంటావని కలలో కూడా ఊహించలేదు
నేను తప్ప నీకు అందరు స్నేహితులే ..
నాకంటే ముందు పరిచయం ఉన్నవారు
నా తరువాత పరిచయం అయిన వేష్టుగాళ్ళు
నిజం తెలుసుకుంటావు త్వరలో
నేను మారను అప్పుడు ఇప్పుడూ నేనింతే
నీలా మారను..మనం పరిచయం మొదలు
ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉంటా
నీ మీద ప్రేమలో కూడా మార్పు ఉండదు