ప్రియా నీ ఊపిరిలో నన్నుండిపోనీ,
గుండెమూల నన్నొదిగిపోనీ
ఎడబాటులో ప్రేమలోతుని చూడనీ,
ఊహలు ఊసులవనీ
ప్రేమున్నా లేకపోయినా,
నీ ప్రతితలపులో నన్నుండిపోనీ
వీలుకాదని వదిలెళ్ళిపోతే
వేదనే వర్షమై నినుతడిపేయనీ!
ప్రియా వదిలేయాలనుకుంటే
నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా
చూపించి దారిమళ్ళిపో
సృహలో ఉంటే జీవించలేని
నన్ను పిచ్చివానిగా మార్చిపో
మమతలగూళ్ళైన
నా ప్రేమ మర్మమేమిటో తెలుసుకునిపో!
ప్రియా నన్ను మరచిన
మైమరపుకే ఆనందమంతా సొంతమవనీ
పలుకనిభావమేదో లిపిలేనిభాషై
నీ పెదవులపై విరబూయనీ
కలకాలం ఆ నవ్వేదో
నిన్ను వీడని నీడలా
నిన్నంటుండిపోనీ
ప్రాణం వీడి నా దేహం
దహిస్తున్నవేళ కూడా అలాగే నవ్వనీ ప్రియా
వేదనే వర్షమై నినుతడిపేయనీ!
ప్రియా వదిలేయాలనుకుంటే
నవ్వుతూ వీడ్కోలు చెప్పేసి వెళ్ళిపో
ఆశల కెరటాలకి గమ్యమార్గమేదైనా
చూపించి దారిమళ్ళిపో
సృహలో ఉంటే జీవించలేని
నన్ను పిచ్చివానిగా మార్చిపో
మమతలగూళ్ళైన
నా ప్రేమ మర్మమేమిటో తెలుసుకునిపో!
ప్రియా నన్ను మరచిన
మైమరపుకే ఆనందమంతా సొంతమవనీ
పలుకనిభావమేదో లిపిలేనిభాషై
నీ పెదవులపై విరబూయనీ
కలకాలం ఆ నవ్వేదో
నిన్ను వీడని నీడలా
నిన్నంటుండిపోనీ
ప్రాణం వీడి నా దేహం
దహిస్తున్నవేళ కూడా అలాగే నవ్వనీ ప్రియా