Saturday, October 6, 2012
" కన్నీరు ............కన్నీటి గాధ "
హాయిగా చల్లగ విహరిస్తున్న నన్నుఇలా మర్చారేంటి
గుండెచుట్టూ చల్లదన్నా నిస్తున్న నన్నిలా చేశారేంటీ
కంటిని కంటికి రెప్పపా కాపాడుతున్న నేనేంటీలా
ఎంజరుగుతుందో తెలీదు...ఎక్కడినించో వెడీ ఆవిర్లు
అప్పటిదాకా చిన్నగా కొట్ట్కున్న గుండె వేగం పెరిగింది
ఎవరో మనసులో అలజడి సృష్టించారనుకుంటా
గుండే అల్ల కళ్ళోకం అవుతోంది
అప్పటిదాకా చల్లగా ఉన్న నేను
ఒక్కసరిగా.. వెచ్చగా మార
కంటిలో చల్లగా సేదతీరిన నేను
ఒక్కసారి మనస్సులో వేడీ
కన్నీటి నుంచి తరిమేయాలని చూస్తుంది
అందేంటి నాకు ఎంజరుగుతోంది
నన్ను తన గుండేళ్ళో వేడి
తరిమేయాలని చూస్తోంది
అయ్యే నేనూ కన్నీరుగా మారానేంటి
నాకు ఇక్కడనుంచి వెళ్ళాని లేదు
కాని గుండె వేగం పెరిగి .. కళ్ళలోంచి భాదగా
నన్ను తరిమేస్తోందా భాద వేడిగామారి
ఎందుకో నేను బయట పడితే '
ఆహృదయానికి కొంచెం అయినా ఉపశంతి ఉంటుందేమో
అందుకే తనను వీడి వెళ్ళ లేక వెలుతున్నా కన్నీటిగా మారి