Thursday, October 4, 2012
పదాల పరదా చాటున.చాలీ చాలని అక్షారాల ఆకలిని తీర్చుకోలేక
నాకేం జరుగుతోంది
పదాల పరదా చాటున
చాలీ చాలని అక్షారాల ఆకలిని
తీర్చుకోలేక పోతున్నా
చెప్పాలనుకున్నది చెప్పలేక
అక్షర దాహం
చేరాల్సిన వారికి చేరుతుందో
లేదొ అన్న అనుమానం..
నిజం మండే సూర్యుడు
ఒకప్పటి మాట
నిజం జాబిల్లి లాంటిదని
ఎవ్వరికి అందదు
చెప్పాలనుకున్న
నిజం తెల్సుకోదు
అర్దకాని నమనస్సుకు ..
మందేదో వేశావు
మత్తులో పెట్టి నన్ను మాయచేశావు
మళ్ళ కనిపించనూ అంటూ వెళ్ళావు
నీకిది న్యాయమా అంటే
కనిపిస్తేగా..
నీ గొంతు వినిపిస్తేగా .?
ఓ కాలమా,
గడిచిపోయిన కాలమా,తిరిగిరావా,
నీకై నీరీక్షణ, నీకై ఆవేదన,
ఆ నాడును,నేడు తలుచుకుంటూ,
నేడును,నాడుగా మార్చుకుంటూ,
అనుక్షణం నీకై భాధపడుతున్నా,
నాటి కాలమా,
నీవు నేడు రావని ఎరిగి,
నాటి తప్పులే,నేటి మెట్లుగా,
భావించి,నేటిని రేపటి కొరకు,
ఉపయోగిస్తూ నేటి కాలానికి ,
నా జీవితాన్ని కలపడానికి
ప్రయత్నిస్తూ.......
ప్రయత్నం లో గెలవను అని తెల్సి
విఫల ప్రయత్నంలో ఓడిపోతూ
గెలుస్తాను అన్న నమ్మకంలేక
ఓటమినే గెలుపుగా బావిస్తూ