కలం కన్నీరు పెడుతోంది
అదేకదా నాకిప్పుడు తోడు
చేసిన బాషలు మర్చిన మనిషి
జ్ఞాపకాల దొంతర కదిపి
అక్షరాలుగ పేర్చాలనే
పిచ్చి ప్రయత్నం
ఏ అక్షరం సరిగ్గా నిలవడం లేదు
ఎక్కడ మొదలు పెట్టానో
ఎక్కడ అంతం చేయాలో
తెలియని వింత పరిస్థితి
నీ జ్ఞాపకాలు చేస్తున్న అలజడి
మాటలు తడబడుతున్నాయి
మాటలు మూగగా మారాయి
ఆలోచన మందగించింది
కలం కదలనంటుంది
మది అలజడి
గుండెళ్ళో దడ
అదుపుతప్పుతున్న మనస్సు
ఆవేశం, ఆందోళన
జరుతున్నది తట్టుకోలేక
జరగబోయేది ఊహించలేక
ఊహకందని వాస్తవాల్ని
వాస్తవాల బ్రమల్ని
కమ్ముకుంటున్నానల్లని మేఘాళ్ళా
ముసురుకున్న జ్ఞాపకాలు
తేనెటీగళ్ళా గుండెను ముసిరి
కుట్టేస్తున్నాయి..
ఎక్కడ బడితే అక్కడ
గుండెకు జ్ఞాపకాల
తేనెటీగలు తియ్యగా
కుడుతూ బొక్కలూ చేశాయి
ఒకప్పుడు నిండుగా విశాలంగా
హృదయం ఇప్పుడూ
చిల్లుల బొంతర అయ్యింది
నీ వెదురు చూసిన క్షనాలు ముగిసాయి
నేనెదురు చూసిన క్షనాలు ముగిసాయి
చివరిక్షనాలు లెక్కపెట్టుకుంటున్నా
నీవు కోరుకునేది అదే కదా
ఆరోజు కోసమేగా నీ ఏదురు చూపులు..?