. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Friday, October 5, 2012

నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు

నేను కవిని కాదు నేను రాసేది కవిత్వంకాదు మనసుపొరల్లో అలజడి ...నావన్నీ తాటాకు చప్పుల్లే తడిఆరని కన్నుల్లో..ఉరకలేసే ఆవేశంతో రాస్తున్నా నేను కవిని అని చెప్పలేని ..నాది కవిత్వం అని చెప్పలేదు ఒకప్పుడు నేను రాసే పిచ్చి రాతలు ఒకప్పుడు నీకు కవిత్వంగా కనిపించాయి .. కాని అవి ఎందుకో పిచ్చి రాతలు అయ్యాయి నాకంటే నీవు మెచ్చిన వారిలా రాయడం నాకు రాదు నేను రాయలేను గుండెగదుల్లో..గూడుకట్టుకున్న నిజాలు సముద్రపు అలల్లా దూసుకొస్తూ అవేశంగా.. అక్షరాల రూపంలో రాసే ప్రయత్నం చెప్పుకునేందుకు మనుషులు దూరం అయినప్పుడు అక్షరాల అమరికకు నేను చేస్తున్న విఫల ప్రయత్నం బారమైన మనస్సుతో అక్షరాలను ఏర్చి పేర్చాలని చూస్తున్నానే కాని నేను రాసేది కవిత్వంకాదు.. నాకు కవితలు రాయడంరాదు కనికరంలేని మనుషులు కన్నెర్ర చేసినప్పుడు కాలిన మనసనే కట్టెల తాలూక మసిపొగే నా రాతలు తలరాతను నా రాతల్లో నీ రాతి గుండెను అక్షరాలతో తడిమే ప్రయత్నం కరగని మనస్సును అక్షరాలతో చల్లార్చే ప్రయత్నమే నా రాతలు చిమ్మ చీకట్లో.. వెలుగును అక్షరాలతో వెలుగునింపాలనుకునే ప్రయత్నం నీ మౌనం వెనుక శబ్దాలను.. ఊహాలోకంలో అక్షరాలు గా మార్చుకొని .. నీతో నేను మాట్లాడుకునే ప్రయత్నం నా రాతలు గతంలో మనం మాటలన్ని మూటలుగా ఉన్నాయి నీగుర్తులుగా ఉన్న మాటల మూటలు విప్పి అక్షరాలన్నీ పేర్చి చూసుకునే ప్రయత్నంలో మౌనంగా ఉన్న నీకు ఏదో చెప్పాలనే ప్రయత్నం నలిగిన హృదయం చెప్పలనుకున్న మాటలను నాలుగు అక్షరాలు పేచి మనస్సును కుదుట పర్చే ప్రయత్నం జరిగిన మోసానికి.. అఘాదాల్లో పడిపోతున్న సమయాన అక్షరాలను పేర్చీ ఏమౌతున్నానో అంటూ నాకు నేను చెప్పుకునే ప్రయత్నం