. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, October 31, 2012

నా జతలో రంగుల జాబిల్లివి అవుతావనుకున్నా

చిరునవ్వుమోముతో
నా జతలో రంగుల జాబిల్లివి
అవుతావనుకున్నా
చిధ్రమయ్యెలా
నా బ్రతుకుకు
స్వాగత తోరణమయ్యావు.
నీ నిస్వార్తపు జల్లులతో
కుసుమాల బృందావనాన్ని
వరంగా ఇస్తావనుకున్న,
నిశ్శబ్దంగా నాలో జారుతున్నా
కన్నీటి జడివానకు
మేఘసందేశానివయ్యావు.
ఆరారు కాలాల వర్ణాలతో
పరవశింప చేస్తావనుకున్న,
నీ జ్ఞాపకాల ధుఖ: సాగరంలో
కన్నీటి కెరటాలను మిగిల్చావు.
ప్రతి నిత్యం వసంత
కోకిలవవుతావనుకున్న,
నీ ఎడబాటులో బ్రతుకే భారామయ్యేలా
విషాద గీతాలను వినిపిస్తున్నావు.
నీ మనసు వెన్నెల కాంతిలో
నా ఆశల విరులు
నీ సిగలో పూయించాలనుకున్న,
కానీ ఓరిమి సాక్షిగా
ఓటమి అడుగు జాడలలో
నడిపిస్తావనుకోలేదు ప్రియా....
నీ ప్రేమను విడిచిన నాకు
ఒంటరితనమే నా సహాగమనం
అదే కదా కడదాక నిస్వార్తపు నా నేస్తం.