. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. . త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com.. త్వరలో " మనసాతుళ్ళి పడకే బ్లాగ్ స్పాట్ వెబైట్ గా వస్తుంది..www.manasulomata.com..

Wednesday, April 11, 2012

తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా..ఎన్నిసార్లని పీకేస్తాం

ఎన్నిసార్లని విరిచేస్తాం
తీరని కలలు కనే ఏ హృదయాన్నైనా
ఎన్నిసార్లని పీకేస్తాం
రాళ్ళ పగుళ్ళలో తలెత్తే ఏ మొక్కనైనా

ఎన్నిసార్లని మూసేస్తాం
దారి మధ్యలో ఉబికే ఏ ఊటనైనా
ఎన్నిసార్లు తొక్కేస్తాం
శాశ్వతం అనుకునే ఏ పరకనైనా

ఎన్నిసార్లని కుక్కేస్తాం
నిండిపోయిన ఏ ఙాపకాల పెట్టెలోనైనా
ఎన్నిసార్లని ఛేదిస్తాం
అసాధ్యమని తెలిసిన ఏ పద్మవ్యూహాన్నైనా

ఎన్నిసార్లని ముందుకుతోస్తాం
అలసత్వం నిండిన ఏ పిరికి మెదడునైనా
ఎన్నిసార్లని చూస్తూంటాం
ఎటు దూకాలో తెలియని ఏ గోడమీది పిల్లినైనా

ఇక చాలు..ఇదే ఆఖరు

ఇది మొదలు..హృదయాలూ లేవు
విరగడాలూ లేవు..రాళ్ళలో చెమ్మా లేదు
మొక్కలూ రావు...దారీ లేదు
ఉబికే ఊటా లేదు..మెదడూ లేదు