మనసుకి స్నేహం మత్తు నిచ్చి నిద్రపుచ్చుతూమాటలకు మౌనం భాషనేర్పినవ్వుకుంటూ
ఇంకా ఎంతకాలమిలా..?
ఆగని కాలంకేసి భారంగా చూస్తూభారమైపోతున్న గుండెకేసి జాలిగా చూస్తూచూస్తూ..చూస్తూ..
చెలిని దూరం చేసుకుంటూఇంకా ఎంత కాలమిలా..?
తొలి పొద్దులో గరిక పూవుపైమంచు తాకి మైమరచింది నేనేనా?
ముంగిట ముగ్గుకి రంగులద్దిమురిసిపోయిన మనిషి నేనేనా?
వాన చినుకుల్లో కలిసి తడిసిఅలిసిపోయిన మనసు నాదేనా?
రేకులు రాలుతున్న పూవును చూసిచెక్కిలి జారిన కన్నీరు నాదేనా?
ఏది అప్పటి సున్నితత్వం?ఏది అప్పటి భావుకత్వం?
ప్రతి రాత్రి నను పలుకరిస్తూ మా ఇంటి కిటికీ లో నవ్వుతూ చంద్రుడు! వెన్నెల ఊసులెన్నో చెపుతూ కన్నెగుండెల్లో ఊహలెన్నొ నింపుతాడు ! ఏతారకతో స్నేహం కుదిరిందో ఇటురానేలేదు
ఈరోజు నిశీధినేలే నెలరాజు! లోకమంతా చీకటి...మనసులోనూ అదే చీకటి...చెప్పలేని ఏదో వెలితి
నీవన్న ఆమాట విస్ఫోటనంలా నన్ను కాల్చేస్తుంది ఇక బ్రతకనేమో..
ఆ మాటతో ఇక నేను జీవితంలో కనిపించకూడదని పిస్తోంది..
ఇలాంటి మాట.." పళ్ళు...." ఆమాట గుర్తు వచ్చి నప్పుడల్లా.ఇందుకోసమా..? ఇన్నాళ్ళు ఎదురుచూసింది అనిపిస్తొంది..
నా జీవితాని సైతం ఫనంగా పెట్టి ..నీసంతోషంకోసం అన్ని భాదలు భరించింది ఈ మాటకోసమా..
చాలు అనిపించుకు కున్నది చాలు ఇక నీకు ఎప్పటికి కనిపించకూడదనుకుంటున్నా
నా వెర్రిగాని ఎప్పుడో నన్ను మర్చిపోయావు ఇంకా గుర్తుంచుకుంటావనేది బ్రమ..