నిన్నటి కన్నా నేడు
నేటి కన్నా రేపు
బావుంటుందనే ఆశతో
రోజు జన్మిస్తూనే ఉంటా!
నిన్ను చేరాలనే ఆత్రంలో.
నీ దగ్గర సేదతీరాలనే పిచ్చి కోరికతో.
ఇలా నీకోసం అకారణంగా
కొన్ని వేల జన్మలు వృథాగా !!
నన్ను నేనుగా నీకోసం.
కానీ,ఏనాడు నీ స్పర్శ సోకిందో..
ఏనాడు నీ ఆలోచనను నన్ను దరి చేరాయో..
ఎప్పుడు మనంగా అనుకున్నామో
ఆనాడే నా పుట్టుక ఆగింది.
కేవలం నీ ___ కోసమే
జీవించడం మొదలెట్టా....!!!
నీ జన్మ నా కొరకై ఉండి ఉంటె ...
నా జన్మకు మోక్షం ఉండేదేమో..
అన్నీ బ్రమలని తేలాయి..మరి ఇప్పుడు
కానీ,నేడు మరణం నన్ను వెంటాడుతోంది..
మరో జన్మకు సమయం ఆసన్నమైందని.
ప్రతి కలయిక
విడుకోలుకు నాంది అంటూ... విడలేను.
మరో జన్మలో కలుస్తామని..నమ్మలేను.
మరి ఏం చేయను
నీ చెంత ఉండాలనే
నా చింత తీరాలంటే ?
నన్ను నేనుగా ఈ జీవితాని చాలిస్తే కదా
మరుజన్మలో నీవడిలో చేసి సేద తీరగలిగేది ప్రియా
అందుకే తప్పైనా తప్పని పరిస్థితుల్లో
రక్త బంధాలు తెంచుకోవడం తో
నీతోడు కోసంఏమి లేని వాడనై
ఉన్నట్టుండి..వానలో నుండి
జారిపడే నత్తగుల్లల్లా..
ఏ మూలాలు లేకుండా..
జన్మించి ఉంటె ఎంత బాగుండేది !!!!
అన్నీ పిచ్చి బ్రమలు పిచ్చి ఆశలని తేలింది లే..
నీవు నాసొంతం అనుకునే ఇలా ప్రతిక్షనం నీ ఊహళ్ళో బ్రతుకు చాలిస్తున్నా