నీ చూపుల భావాల్ని
అనుబంధంగా తలచా
నీవు నాలో రేపిన ఆశల్ని
అనురాగం అనుకున్నా
నీమాటల్లో అర్ధాన్ని
ప్రేమగా భావించాను
నా హృదయాన్ని నీకే
సమర్పించాను ప్రేమతో
దరికి చేరుస్తావని భావిస్తే
దూరం చేసావు నిష్కర్శగా
మౌనంగా మిగిలిపోయాను
కనిపించని కన్నీటితో
మనసు రగిలింది ఆగలేక
హృదయం పగిలింది నిలువలేక
ముక్కలైనా హృదయంలో నిను
దాచాను పదిలంగా ప్రతి ముక్కలో
నీకు చూపాలని ఉంది నీపై
ఎన్నో రెట్లు పెరిగిన ప్రేమను
వెలలేని ప్రేమను వెతుక్కుంటూ
నువ్వు వస్తావన్న నమ్మకంతో !!