నీవు శ్వాసించి వీడిన గాలి నా హృదయాన్ని చేరి,
నీ తలపులతో నాకు ప్రతిక్షణం ఊపిరినిస్తుంది.
నా మదిలో మంచులా కోలుఉన్న నీ రూపు, నీపై
తాపంతో కరిగి అలజడితో అలలా ఎగసిపడుతుంది.
నీ జ్ఞాపకం నా లయలో బడబాగ్నిలా మండుతూ,
నిన్ను చేరుకోమని నన్ను ఎండమావిలా చేసింది.
నీతో నడిచిన ప్రతిచోటు నీ స్మ్రుతులనే తలపిస్తూ,
నువ్వు లేని నేను, నేను కానని నవ్వుతున్నాయి.
ఆకాశంకన్నామిన్నగా ఉన్న నా ప్రేమను మోయలేకున్న
నన్ను చూసి ఆ నింగి చినుకై నిన్ను చేరుకోమంది.
పంచభూతాలు సైతం నా ప్రేమకు పరవశించి నన్ను నీతో
కలపాలని ప్రయత్నిస్తున్న నీ మౌనం నన్ను ఆపేస్తుంది.
హృదయంలో నాపై ఇష్టం దాచి నీ మనస్సును నువ్వే
ఎందుకు వెలివేస్తున్నవో తెలియక నా మది నీ పిలుపుకై వేచిఉంది.