గడిచిపొతున్న గడియలన్ని జ్ఞాపకాల మాలలవుతున్నాయి,
నా మనసులొసులొ ఒక్కొకటిగా గుచ్ఛుకుంటున్నాయి,
ఎగసిపడే కెరటంలా ప్రతిరోజు నిన్ను చేరుకుంటున్నాను,
నీరాశతో తిరిగి వెనక్కి వెళ్ళిపొతున్నాను,
నీ అంగీకారం దొరకక,
పంజరంలో ఉన్న పావురంలా ఉంది నా ప్రేమ.
బయటకి రావాలని నీ మనసుని చేరాలని ఎదురుచూస్తుంది,
సరస్వతీ పుత్రికవైన నీకు,
నా చూపుల భాష తెలియటం లేదా?
లేకపొతే ప్రేమలేక నీ మనసు శిలైపొయిందా?