వేకువఝామున తొలికిరణం నువ్వై తాకినందుకే
ప్రతి ఉదయం కొత్తవెలుగులతో స్వాగతిస్తుంది
అపరాహ్నంలో నీ ఊసు తలపోసినందుకే
నీలాకాశం నీ రూపురేఖలతో నను కవ్విస్తుంది
మలిసంధ్యలో నువ్వు నా మది మీటినందుకే
మనసు కొమ్మపై కొత్త కోయిల ఆలపిస్తుంది
నడిరేయిలో నీ తలపు లీలగా మెదిలినందుకే
గతం జ్ఞాపకాలు నన్ను ప్రతిక్షనం తరుముతుంటాయి
ఇలా నీ ద్యాసలోనే సాగిన ప్రతీ రోజూ
వేయి రంగుల హరివిల్లై మది విరబూస్తుంది..
ఇదంతా గతం ప్రస్తుంతం నీవు దూరం అయి ..
అను భవిస్తున్న నా ఈ భాదను ఎప్పుడు అర్దం చేసుకుంటావో ప్రియా