ఏనాటి బంధమో ఇది.....!!
మన మనసుకు ఎవరు ఎపుడు ఎందుకు నచ్చుతారో తెలియదు...ఎవరితో ఏ బంధం ఏర్పడుతుందో అది ఎలా కొనసాగుతుందో...ఎవరు ఊహించలేరు.ఆ బంధాలలో కొన్ని అమోదయోగ్యమైనవైతే మరి కొన్ని (సమాజం దృష్టిలో ) కావు.ఏ దృష్టిలో చూసినా... ఆ బంధాల వల్ల కలిగే ఆనందం ఉందే అది శాశ్వతమైనది... అది ఏ దృష్టి కోణాలకు అందనిది...లొంగనిది...అలాంటి ఓ..మానసిక బంధమే నీకు నేనున్నానన్న నమ్మకాన్ని కల్పిస్తుంది.ఆ...నమ్మకమే మన జీవితాన్ని నడిపిస్తుంది....ఏ కష్టానికి చలించని ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అంతకన్నా మన జీవితానికి మరేదైనా.... కావాలా....??
ఈ నా జన్మను పునీతం చేయడానికి వచ్చిన ఓ...నా ప్రియ బంధమా...! ఇదిగో నన్ను నేను నీకు అర్పిస్తున్నాను. నీ చల్లని చేతులలో, నీ వెచ్చని కౌగిలిలో,నీ ప్రేమ పూర్వకమైన మాటలలో ఎల్లవేళలా నేను ఉండేలా....నన్ను అనుగ్రహించు.