నాకు ప్రాణాన్ని పోసావు
నా ఊహలకు రెక్కలు తొడిగావు
ఇంకేముంది
స్వేచ్ఛగా విహరిస్తున్నా...
నీ చుట్టూ... సీతాకోకనై
నీ జీవితానికి రంగులద్దాలని
ముద్దు ముద్దుతో..
నీ బాధనంతటిని తొలిగించాలని
కౌగిలింతతో..
ఎనలేని సౌఖ్యాన్ని అందించాలని
ప్రతీ రతిలో.
కాస్త చిరాకేసినా...
నిరాశ తొంగి చూసినా..
క్షణం కూడా ఆలస్యం చేయకు
ఇంకేమి ఆలోచించకు
నన్ను పిలువు
నా ఎదపై వాలి సేదతీరు
ఈ లోకానికి తెలియక పోయినా..
నీకు తెలుసు కదరా..
నేన్నున్నానని
మరి ఇంకెందుకు చింతిస్తావు ఒంటరినని.
నా మరణం ఎక్కడో లేదు
నీ బాధలో ఉంది
ఒంటరిననే నీ దిగులులో ఉంది
కన్నిటిలో నన్ను జారనీయకు రా..ప్లీజ్....