ఏం చేయాలి కాలమా....??
కాలం కరుణిస్తానంటే నాదో కోరిక...
నేను తన సమక్షంలో ఉన్న సమయంలో కాస్త నెమ్మదిగా కదలమని
లేదా... అక్కడే ఆగిపోమ్మని.
ఎంత దగ్గరైన...
ఇంకా చేరలేని దురమేదో... ఉంది.
చెప్పే ఊసులన్ని గాలిలో కలిసిపోతాయి
చెప్పలేని ఊసులన్ని గుండెలో గూడు కట్టుకుంటాయి...
ప్రేమో తెలియదు
మోహమో తెలియదు
కానీ, తను ఎంత అవసరమో మాత్రం తెలుసు !
నా..ఆరాధనను
కళ్ళతో కాక మాటలతో చెప్పాలని
ప్రతి రోజు అనుకుంటాను...
కానీ,తను రాగానే
తన ఎదపై వాలిపోవాలని ,
తన పెదవులను తడపలనే మోహంలో పడి
మౌనమై పోతాను...
24 గంటలూ... నా ఆలోచనలలో మెదిలే తనని
కనీసం... 4 గంటలైన... నా ముందు నిలుపుకోవాలంటే...
ఏం చేయాలి..... కాలమా....?!