ఎవరు నీవు.....?
నాకు ఏమవుతావు.....??
నన్నెందుకు ఇలా....వేధిస్తావు???
నీవు కలవైతే
నేను నిదురిస్తాను...
మధురమైన జ్ఞాపకమైతే
నా మస్తిష్కంలో ఏదో పొరలో.....
నిన్ను పదిలంగా.....నిక్షిప్తపరుస్తాను.
గాయం రేపె బాధవైతే
మౌనంగా.....భరిస్తాను.
కానీ....,
నీవు మాటలు రాని మౌనంలా...
వెలుగు లేని చీకటిలా...
గులాబీ చాటు ముల్లులా......
అనుక్షణం నన్ను వెంటాడే నీడలా...
ఎందుకు నన్ను ఇలా.......వేధిస్తావు....????