"ఘనీభవించిన కాలం
ఒక్కోసారి గుండెను గాయం చేస్తుంది
మరోసారి కోలుకోలేకుండా మార్చేస్తుంది
ప్రయాణమే జీవన మార్గంగా మారిన ప్రస్తుత తరుణంలో
మాటలు కరువయ్యాయి ...ఇక చూపులే మిగిలాయి ..
హృదయం మంచు ముద్దగా మారింది ...నీ గురించి ఆలోచించి ..ఆలోచించి ...
అయినా ..నువ్వు అక్కడ నేను ఇక్కడ
దారులు వేరు..గమ్యాలు వేరు ..
ఊహల్లో నేను ..కలల అలలై ఎగసి పడుతుంటే
నేను మాత్రం నీ తలపుల తనువు కోసం ఆరాటపడుతున్నా ...
మన పరిచయం ...సముద్రం లోని దిక్సూచిలాగా మారింది ..
అప్పుడప్పుడు ఓ రెండు మాటలు ..మరికొన్ని వాలు చూపులు ...
నీ కళ్ళు మెరిసినప్పుడు ...నీ పెదవుల మీద దరహాసం విరిసినప్పుడు
నీ గుండెల మీద ..నా చూపు గులాబిగా మారి నిన్ను గుచ్చుకున్నప్పుడు
నేను నేనుగా ఉండలేకపోయా ...
బహుశా ఇది మన మద్య మరింత దూరాన్ని పెంచింది
పెను అనుమానాలకు తావిచ్చింది ...
నిన్ను విడిచి నేనుండలేను ..నన్ను నేను సముదాయించుకోలేను..
మనసు పొరల్లో నిక్షిప్తంగా ఉండిపోయిన ..ఆ కాసిన్ని కన్నీళ్లను కార్చటం తప్పా ...
అందుకే ..నిండారా ..ఏడుస్తూ ఉన్నా ...
నువ్వు ..హాయిగా ఉండాలని ..వెళ్ళిపోతున్నా నీకు దూరంగా.. "
వెంటాడే జ్ఞాపకాలు