ప్రేమిస్తున్నాను అని,
నాకోసమే జీవిస్తున్నానని ... అన్నావు
ఎప్పటికీ నాతోనే అన్నావు
నీ జీవనం అని ... అన్నీ అబద్దాలు!
నా భావనల్ని, ఊహల్ని
కాలరాసి ఆత్మను ముక్కలు ముక్కలుగా మిగిల్చావు
నా ఆనందం హరించి
గుండెల్లో గాయాన్ని రేపావు!
బాధే ... మిగిలింది
ఆత్మ ఆవిరై ...
నమ్మలేని నిజం నీవు అబద్దాలాడటం