నీ జ్ఞాపకాల పందిరిలో.... ఇంకా నే బ్రతికున్నా....!
కమ్మగా వీనులవుందు చేసే ఆ కోకిల గానం ఎమైందీ!
చిట్టిచిలకమ్మ చెప్పేటి ఆ ముద్దుముద్దు మాటలు ఏమైయ్యయీ!
కోకిల గొంతు మూగబోయిందా!
చిలుకమ్మ కూడా ఎగిరిపోయిందా!
లేక.... నా కర్ణభేరి కరిగిపోయిందా!
మంచుబిందువులతొ మెరిసేటి ఆ పచ్చిక బయళ్ళు,
గలగలపారేటి ఆ సెలయెరు,
చిరుగాలికి సిగ్గుపడుతూ రమ్మని పిలిచే ఆ పూతోటలు,
ఏవీ?... అగుపించవేమీ!
ప్రకృతి విలయతాండవంలో కనుమరుగయ్యాయా!
లేక..... నా నయనములు నాశనమైపోయాయా!
పిల్లగాలికి పులకరించే నా శరీరం..
మొద్దుబారిపొయిందేమో!
లేక.. పిల్లగాలి నను వెలివేసిందా!
మైమరపించేటి ఆ పూతోటల పరిమళాలు
నా శ్వాసకు అందటం లేదేమీ!
కొంపదీసి నా శ్వాసగానీ... ఆగిపోయిందా!
ఇంకా లేదే!
నీప్రేమై వెర్రికేకలు పెడ్దుతున్న నా హ్రుదయనాదం ఇంకా నాకు వినిపిస్తుంది కదా!
అవిగో, నీటిపొరలు నాకు ఇంకా కనిపిస్తూనే వున్నాయికదా!
నీ చేతి స్పర్శకై నా శరీరం ఇంకా తపిస్తూనే వుంది కదా!
ఆ శ్వాస కూడా.. తెరలు తెరలుగా.. పరిగెడుతుంది కదా!
అవును...కదా!
ఇంకా నే బ్రతికేవున్నానేమో!
తెరలు తెరలుగా కమ్ముకువచ్చేటి రోదనను అదుపుచేసుకుంటూ....
పొరలు పొరలుగా పారేటి కన్నీటిని సుడులు తిప్పుకుంటూ....
పగులుతున్న హ్రుదయానికి అతుకులు వేసుకుంటూ....
నీ జ్ఞాపకాల పందిరిలో.... ఇంకా నే బ్రతికున్నా....!
నీకుమల్లేనే ఈ ప్రకృతి కూడా ఇక నాదరి చేరదేమో!