అదేంటో...
నాభి నుండి గుండె దాకా...
సర్రున ఎగబాకుతుంది.
ఉన్నట్టుండి ఉలిక్కిపడేలా..
చేతికి చిక్కదు
పట్టు వదలదు
ఎటు నుంచి ఎటు పాకుతుందో
మెలిపెడుతుంది దేహాన్ని..
అదేంటో....
ఎంత తడిపిన తడవని పెదాలు..
ఒకటికి ఒకటి ఆధారంగా ఉన్నా...
వణుకుతునే ఉన్నాయ్...
అదేంటో...
ఏదో భారాన్ని మోస్తున్నట్టు
ఎపుడు వాలిపోదామా అనుకునే కళ్ళు
నీ నులి వెచ్చని కౌగిలో చేరాలనే తహ తహ..
నీతో కల్సి రతీ దేవుని నాట్యాలు చేయాలనే తపన పెరుగుతోంది ప్రియా..?
నీ ఆలోచనలతో కళ్ళు మూతలు పడితే చాలు
తెరవాలనే ఆశే లేకుండా...
నిదురించాలని అనుకుంటాయి.
ఏంటి ఇదంతా...అంటే
కారణం ఒకటే...
"నువ్వు".
నిద్రలో నీగురించే కలవరింతలు..
మెళుకువలో ప్రతిక్షనం నీగురించే ఆలోచనలు..
నాకేదో జరుగుతోంది నీవు నన్నేదో చేస్తున్నావు ప్రియా...?
నా నరనరాళ్ళో నీ ఆలోచనలతో నిండి నన్ను నివనీయడంలేదు మనస్సు ప్రియా