నీవన్నది నిజం...
నేనన్నది అపద్ధం...
మనమన్నది తాత్కాలికం
మన బంధమే శాశ్వతం
గత జన్మ వాసనలే
మనల్ని దగ్గర చేస్తే...
మన కలయిక అర్థవంతమే కదా...?!
మరి,
నీవెవరివో...
నేనెవరినో....
ఇలా....ఏలా...కలిసామో...
అన్న ప్రశ్నలు నీకెలా...?
ఏ...అడ్డంకులు లేకుండా...
నీ...సహచర్యమే లోకంగా...
బ్రతకడమే ఓ... వరంగా....
పొందడమే నా...లక్ష్యంగా....
నే జీవిస్తున్నాను.....!!
మరి ఈ జీవితాన్ని విడి వెళ్ళవు కదా....??