నా చుట్టూ ఎదో జరుగుతుంది
కంటికి కనపడని యేవో శక్తులు నన్ను చుట్టుముట్టాయి,
అవి నాకు ఊపిరాడకుండా చేస్తున్నాయి
నన్ను ఒక చోట నిలబడకుండా చేస్తున్నాయి
వేయి టన్నుల బరువు నా బుజాలపై,శిరస్సు మోపి నన్ను పాతాళానికి త్రొక్క ప్రయత్నిస్తున్నాయి,
అవి నన్ను ఎత్తైన ప్రదేశానికితీసుకుపొయి క్రిందికి వదిలే ఆలొచనలు చేస్తున్నాయి
ఈ క్షణం నన్ను నేను కోల్పోతున్నా
అసలు నేను ఎవరో కూడా మర్చిపోతున్నా
నా కన్నులు మూతపడి పోతున్నాయి క్రమేపి
చిరు చమటలు అల్లుకుని చేతులు చల్లబడిపోతున్నాయి
నా వారందరికీ దూరమైపోతున్నా బావన.....
అంతలో చిన్నగా సూర్యకిరణాలు నా నుదుటిపై చేరి నన్ను నిద్ర లేపాయి..కళ్ళు తెరిచి చూసా