Tuesday, April 17, 2012
హృదయానికి చెబితే .. ఏం నీకు చేతకాదా..ఆమ్మాయి మనసు జయించలేవాని వెక్కిరిస్తుదేమో
పదహారణాల పడచుపిల్ల.. మనసులో ఎముందో..వాలు జడ ముందుకేసి ...తలనిండా మళ్ళెపూలు తురుముకొని... ఏ యువరాజుకోసమో .. కలల రాకుమారుడికోసమో ఆ ఎదురు చూపులు దూరంగా నిన్ను చూసిన క్షనాన దగ్గరవ్వాలనే తొందరపాటులు అలా దగ్గరకు రాగానే ఒక్కసారిగా కోరగా చూసిన నీ చూపులు నాగుండెళ్ళో గుచ్చుకున్నాయి..అప్పుడే చల్లగా వీసిన పిల్ల గాలి నీ తలలోని మళ్ళేల వాసనను నా హృదయంలో రేపెను అలజడి. ఎమని చెప్పను ప్రియా..సామ్రాజ్యాలు జయించడం ఈజీనెమో గాని నీలాంటీ అందగత్తె వాలు చూపుల్లో చిక్కుకొని నీ తలలోని మళ్ళేల సువాసనల్లో చిక్కుకున్న నేను..చూట్టూ శత్రువులు చుట్టు ముట్టీన రాకుమారుళ్ళా రాబోయే యుద్దం గురించి ఆలోచించడంలేదు .. నీ చూపుళ్ళో పడి విలవిల లాడుతున్నా నా హృదయాన్ని ...ఎలా సమూదాయించాలా ఆచూపులు నాకోసం కాదేమో అన్న సందేహంతో .. అయినా ఈ మాట నా హృదయానికి చెబితే .. ఏం నీకు చేతకాదా..ఆమ్మాయి మనసు జయించలేవాని వెక్కిరిస్తుదేమో అని భయం.. గెలవలేను అనికాదు గెలిచే అర్హత నాకు లేదేమో అన్నచిన్న సందేహం దూరంగా నిలబడి ఆ అందాలను చూస్తూనే ఉన్నా దగ్గరికి రాలేక దరిచేరితే .. ఆ కన్నుల మాటున దాగిఉన్న అసల్ను నిజం నేనే అయితే ఈ చిన్ని ప్రాణం తట్టుకుంటుండా ప్రియా... ఏంటో ఎమంటున్నానో ఏంచేస్తున్నానో అర్దం కావడం లేదు .. అంతా మనసంటా గందరగోళంలో అలా దూరంగా ఇలా ఆచిస్తున్నా ప్రియా