ముక్కలైన మనసు కథ
కనురెప్ప వాలిపోతోంది.....
పొంగిపోతున్న కన్నిటికి ఆనకట్ట వేసేందుకు .....
గుండె బరువెక్కుతోంది .....
బద్దలవుతున్న బాధను బందించేందుకు ....
చేయీ అలసిపోతోంది .....
చెక్కిలి పై కన్నీటి ఆనవాళ్ళు తుడిచేందుకు. ....
వేదన రాగాన్ని ఆలపిస్తున్న మూగ గానం నాది.........
అది విని కరిగే హృదయపు ఉనికి ఏది ...?
ముక్కలైన మనసుతోనే ... శిదిలమైన ఆస తోనే సంచరిస్తున్నా...
మనిషి లాగే కనిపిస్తూ శిల లాగా బ్రతికేస్తున్న.