Wednesday, April 11, 2012
ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు
నీ కళ్ళలో అనేక భావాలు పలికించగలవు..అందుకే ఆకళ్ళంటే ఇష్టం
నీ చూపుల్లో అమాయకత్వం... ఆరాదన..నమ్మకం కనిపించేది
ఆ అందమైనకళ్ళు అబద్దాలు చెప్పవని చెప్పే దైర్యం లేదని నానమ్మకం
కల్సిన కనిపించిన ప్రతిసారి ఆకళ్ళలో అనేక భావాలు వెతికే వాడిని
ఆ కళ్ళ వెనుక కళ్ళా కపటం లేని నిజాయితీ కనిపించేది నాకు ఎప్పుడూ
ఆప్యాయత అనురాగం ఎంతో ప్రేమతో చూసేవాకళ్ళు...కాని
ఆ కళ్ళే నన్ను మోసం చేస్తాయని కలలో కూడా నమ్మలేదు
ఆకళ్ళే నన్ను అనరాని మాటలు అంటావని అస్సలు ఊహించలేదు
అప్పుడు ఆమనిషి అలా ఇప్పుడు ఇలా ..అంటే రోజులు మారితే కళ్ళలో నిజాయితీ మారుద్దా...?
నేనేంటో తెల్సి కూడా నీవు ఎలా నన్ను అనగలిగావో తెలీదు..
ఆకళ్ళు మోసం చేసాయి అంటే ఇప్పుడు నమ్మ బుద్ది కావడం లేదు..
మరొకరి వంచనచేరి ఆ అందమైన కళ్ళూ నన్ను వెక్కిరిస్తాయని ఊహించలేదు..
మరికరి వంచనచేరి అనకూడని వినకూడని మాటలు అంటాయని నమ్మలేకున్నా
ఆకళ్ళో అప్పుడు చూసిన నిజాయితీ పారిపోయింది.. ఆనిజాయితి లెదిప్పుడు అంటా స్వార్దం
అప్పుడు నీవంటే ఓ దైర్యం కాని ఇప్పుడు నీవు మోసం చేసిన ఘటనే గుర్తుకొస్తుంది
ఎవడో వేష్టుగాడు పనికిరానివాడు..పద్దతి తెలియని వాడు చెబితే నమ్మావు
వాడికి బందాలు బాందవ్యాల విలువ తెలీదు..
తనస్వార్దంకోసం ఎలాగైనా ఎవ్వరి జీవితం నాశనం చేయగలడు..
తనస్వార్దం కోసం ఆడపిల్లలా ఏడుస్తాడు..ఎన్ని జీవితాలు నాశనం అయినా అనుకున్నది సాదిస్తాడు..
మనసుకు నచ్చిన మనిషిని అంతలా ఎలా భాదపెడటాడో నాకు ఇప్పటికీ అర్దంకాదు
నన్నోడిస్తుంటే ఆనందా చూస్తూ ఆకళ్ళు నా నిజాయితీని ఎలా శంకించాయో నన్నెలా మోసం చేశాయో కదా..?
Labels:
కవితలు