ఆ నిమిషం....అవును. ఏం చేస్తాను నీ దగ్గరకొచ్చి ?
మౌనంగా నిన్ను చూస్తూ ఉండటం తప్ప
నీ కళ్ళల్లో నన్ను వెతుక్కోవడం త్తప్ప
నా ఆత్మను నీ ముందు ఆవిష్కరించడం తప్ప
ఇంకేం చేస్తాను ??
రెప్పలు లేని జీవి ఏది అన్నావుగా...
ఆ జీవి నేనే ఐతే బావుండు అనుకున్నా..
రెప్ప పాటు కాలమైన నిను వదులుకో లేక
నా స్వప్నం నీవు...
చిన్న అలికిడైన చేదిరిపోతావు.
ఎన్నో అలజడుల మధ్య...
నిన్నెలా... కనమంటావు.
అందుకే నీ దగ్గరికి వస్తాను అంటాను...
నీ స్పర్శ సోకనిదే జీవించలేని ఈ... దేహాన్ని
నలుగురి ముందు నీకెలా.. అప్పగించామంటావు.
అందుకే నిన్ను ఒంటరిగా కలవాలంటాను.
నీతో గడిపే ప్రతిక్షణం
నాకెంత విలువైనదో నీకేం తెలుసు.
అది తెలిసిన నాడే తెలుస్తుంది నీకు
నేను ఏం చేస్తానో.... !!