నేను నీకు ఎంత చేరువలో ఉంటానంటే,
జారే కన్నీటిబొట్టును తుడిచేటంత చేరువలో,
నా గుండె చప్పుడు నీకు వినబడేంత చేరువలో,
నా ప్రతిబింబం నీ కంటిపాపలో కనబడేటంత చేరువలో,
నా ప్రతిమాటా నీ మనసుకి చేరేంత చేరువలో,
నీ నీడతో కలిసి నా నీడ నడిచేటంత చేరువలో,
నీకు తోడుగా నీ చెయ్యి పట్టూకోని నడిచేటంత చేరువలో.
నీశీదిలో కదిలే మేఘనికి తెలుసు నీటి బరువు,
నామదిలో మెదిలే ప్రేమకు తెలుసు కన్నీటి బరువు.
నిన్ను ప్రతిబింబంగా మార్చి నా కనుపాపలో దాచుకున్నాను,
కాని నా మనసుకి గాయం చేసి కన్నీరుగా మారి జారిపోయావు
ప్రేమను పంచుతానంటే నమ్మనంటున్నావు,
ప్రాణం అర్పిస్తానంటే నవ్వుకుంటునావు,
నా ప్రేమ విలువ నీ చిరుకోపమా?
లేక నా ప్రాణం విలువ నీ పరిహాసమా?