Tuesday, April 17, 2012
కన్నీళ్లను దిగమింగుకుని కాలం పెట్టే పరీక్షను తట్టుకుని
ప్రేమ రాహిత్యంలో కొట్టుకు పోతున్న తరుణంలో..ముళ్ళను దాటుకుని .. కన్నీళ్లను దిగమింగుకుని కాలం పెట్టే పరీక్షను తట్టుకుని నిలబడే ప్రయత్నం చేస్తున్న సమయంలో నువ్వు అద్బుతంగా అగుపించావు లబ్ డబ్ మంటూ కొట్టుకుంటున్న గుండెకు కాసింత ప్రేమను పంచావు అంతులేని ఆనందాన్ని ఇచ్చావు ఇదే ప్రయాణంలో ..నీ చల్లని చూపే నిజమంటూ నన్ను నిలువునా తోడేస్తోంది ఇద్దరం ఒక్కరమై ఈ లోకాన్ని చూస్తూ ఉంటే జీవితం చిన్నదైనట్టు.. నీలోకి నేను చేరిపోతున్నట్టు అనిపించింది .. ప్రేమంటే ..ఇదేనేమో ..ఇలాగే ఉంటుందేమో అనుకుంటూ సాగిపోవటమే కదా ముందున్నది ... చెలీ ..నువ్వో మువ్వవై నా హృదయంపై చిరుజల్లుగా మారి సందడి చేస్తుంటే ... ఎంత హాయి కదు.. ఎంత మోహావేశం కదూ .. మార్మికపు ప్రపంచంలో ప్రియురాలి ఒడిలో వాలి పోవటం అంటే ఓ గొప్పనైన అనుభవం స్వంతం చేసుకున్నట్టు .. నువ్వు సత్యం ..నువ్వు వాస్తవం నువ్వే నా సమస్తం .."
Labels:
జరిగిన కధలు