ఎంత దగ్గరైనా...
దగ్గర అవుతున్నా....
ఈ జన్మకు సరిపడే దూరం ఉంది.
మరు జన్మకైనా...
ఎడబాటు లేని కలయిక కావాలి....
అది నువ్వైనా..
మరెవరైనా...కాని.
కానీ...ఈ జన్మ మాటేమిటి ?
అవును.నవ్వు నేను ఒకటి కాదనేది వాస్తవమే,
అంగీకరిస్తాను.
అయితే కావాలనుకున్నప్పుడల్లా...
ఒక్కటవుతున్నాం కదా...
అది వాస్తవం కదా...?
దాని మాటేమిటి ??
అయితే....కేవలం నీ ఊహలతో...
ఎప్పటికి (తెలియని) నీ వాడనై..
ఉండటం ఎందుకు వాస్తవం కాకూడదు ??
నాకంటూ... ఇంకొకరెందుకు ... ???
నేనంటూ...ఉన్నానని...
నాకంటూ... ఒకరు కావాలని
గమనించని ఈ లోకానికి దూరంగా...
ఒంటరిగా...నా ఊహలలో జీవిస్తున్న నన్ను
నేనున్నా రమ్మంటూ... వాస్తవం లోకి లాగింది నువ్వే.
నేడు నేనున్నా...లేకున్నా...అంటే
ఆ వాస్తవం నాకెందుకు ??
నాకై
నీ కంట ఒలికే కన్నీటి చుక్క
నీ పిడికిలిలో భద్రంగా ఉన్న నా చేయి
నీ నుదిటిపై నా పెదాల ముద్ర
ఇవే నా ఉనికి
ఇదే నా వాస్తవం
వీటన్నింటిని ఇంకొకరిపాలు చేయాలనీ చూడకు.
ఊహకైనా...వాస్తవానికైనా...
ఉండాల్సింది ఒక్కటే...
మనం.
మనం లేని నాడు ఏది లేదు.