Wednesday, April 13, 2011
నా డైరీలో ఓ అమ్మాయి పేజి..( Its Real )..Part-1
సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి కాని...మనకెందుకులే అనుకుంటాం..కొని విషయాలు మనసుల్ని కలచి వేస్తాయి..రిపోర్టర్ గా ఎందరినో కలుస్తుంటాం రకకాల కధలు తెలుస్తుంటాయి...ఇది ఓ గోల్డ్ మెడలిష్టు రియల్ ష్టోరి..ఎందుకు చెబుతున్నాను అంటే నిజంగా ఇలా జరుగుతున్నాయి...పైకి పెద్ద మనుష్యుల్లా ఉండి అమ్మాయి ఒంటరిది ..అని తెలిస్తే మాత్రం ఎదోవిదంగా అవకాశాన్ని అందిపుచ్చుకుందాం అని చూస్తున్న పెద్ద మనుష్యులున్నారు.. పైకి పెద్ద మనిష్యులు నీతులు చెబుతుంటారు.... మనిషిలోపల మరో మనిషి ఎదుటి వాళ్ళ అవసరాన్ని క్యాష్ చేసుకుందాం అని చూసే కుక్క బుద్ది....ఎదుటి మనిషి ఆపదలో ఉంది ...దుక్కంలో ఉంది అన్న ఇంగిత జ్ఞానం లేకుండా లేకుండా ప్రవర్తించిన ఘటన ...తనకు ఇంత కూతురు ఉందన్న ద్యాసకూడాలేని మనిషి ఓ అమ్మాయిని పెట్టిన మానసిక వేదనకు ప్రతిరూపమే ఇది...
తండ్రి చాటు బిడ్డ సరస్వతీ పుత్రిక... చదువు లో ఫష్టు..ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు లేవు ...హాయిగా చదువుకొంటూ అందరి మన్ననలు పొందిన ఓ అందాల బొమ్మ కధ ఇది..పూర్తిగా ఇక్కడ చెప్పక పోయినా నిజాలు చెబుతున్నా ..యూనివర్సిటిలో గోల్డ్ మెడల్ సాదించి హైదరాబాద్ చేరుకుంది...మధురిమ ( పేరుమార్చాను)హైదరాబాద్ అనగానే మధురిమ తండ్రి గుండెల్లో రైల్లు పరిగెత్తాయి..నడక నేర్చిన లేడిని ఎన్నాళ్ళని కాపాడతాం తనకు కష్టాలు సుఖాలు తెలియాలని గుండె దిటవు చేసుకోని ఉద్యొగం కోసం అని హైదరాబాద్ పంపాడు మధురిమ ను మొదట బాగానే ఉంది అమ్మాయి సౌమ్యురాలు అంటూ పొగిడారు..అందులో చదువులో గోల్డ్ మెడలిష్టు కాబట్టి ..సదరు ఆఫీసులో అందరూ ఎంకరేజ్ చేసేవారు...ఇలా అందరూ తనను పొగుడుతుంటే అమ్మాయి మధురిమ ఆనందం అంతులేదు ..ఆఫీసులో ఓ పెద్దాయన ఈ మధురిమ పై ప్రత్యెకశ్రద్దచూపిస్తుంటే తన తండ్రిలాంటి వాడనుకోని అన్ని విషయాలు అడిగి తెల్సుకునేది..ఆ పెద్దమనిషే ఓ సారి చెప్పాడు తనకు అమ్మాయి మధురిమ ఆనందం అంతులేదు ..ఆఫీసులో ఓ పెద్దాయన కు మధురిమ అంత కూతురు ఉందని..సో తనను సొంత కూతురిలా చూసుకుంటున్నాడనుకోని సంతోష పడించి మధురిమ అందుకే ప్రతివిషయాన్ని ఆ పెద్దాయనని అడిగి తెల్సుకునేది.. ఆయన దగ్గరుండి అన్నీ చెప్పేవాడు..ఈ విషయాలన్ని తండ్రి రోజూ ఫోన్ చేస్తున్నప్పుడు పూసగుచ్చినట్టు చెప్పేది మధురిమ మధురిమ తండ్రికూడా హేపీగా ఫీల్ అయ్యాడు...కాని ఇక్కడే ఆ పెద్దాయన మనసులో ఈ అందాల బొమ్మ పై కన్నేసి కబలించాలని చూస్తున్నాడని తెల్సుకోలేకపోయింది మధురిమ..ఈ లోగా మదురిమ జీవితంలో కోలుకోలేని దెబ్బ...తండ్రి అనుకోకుండా అకాలమరణం మదురిమను ఎంతోకుంగ దీసింది..ఆ ఫీసులో ఆపెద్దాయన తండ్రి పోయాడని సానుభూరి చూపిస్తుంటే తండ్రిపోయినా ...దేవుడు మరో తండ్రిని ఇచ్చాడని భాధలోను ఆనంద పడింది.. అలా ఓరోజు ఆ పెద్దాయన మధురిమను ఇంటికి రమ్మన్నాడు... భాదలో ఉన్నావు ఇంటో నాకు నీ అంత కూతురు ఉంది కాస్త ఉపశమనం ఉంటుంది అని..బంగారు లేడి మధురిమ నిజమే అని నమ్మి ఆయనతో వెళ్ళింది.... ఇంటికి వెల్లగానే అక్కడేవ్వరూ లేరు అదేంటిసార్ ఇంట్లో ఎవ్వరు లేరు అని అడిగితే ఇప్పుడే వస్తారని చేప్పి సదరు పెద్ద మనిషి.. తన నిజస్వరూపాన్ని చూపెట్టడం మొదలు పెట్టాడు..అంతే బెదిరిపోయిందా బంగారు లేది మధురిమ ఏంచేయాలో అర్దం కాలేదు...మంచినీళ్ళుకావాలని అడిగి ఇదే అదును గా చూసుకోని బయటకు పరుగెత్తింది..అలా పరిగెత్తి పరుగెత్తి ఎప్పుడు ఇంటికి చేరుకుందో తెలీదు..గుండెనిండా భాద మనసులో ఆందోళన ...రేపు ఆఫీసుకు వెలితే తండ్రిలేని ఒంటరిని చేసి ఎమైనా చేస్తాడని బయం ఆవరించిదా అమ్మాయి రాత్రంతా ఏడుస్తూనేఉంది.....ఎంత ఏడ్చినా ఎంత భాదపడినా జరిగిన వాస్తవం అబద్దం అవ్వదుకదా..?..ఆలా రెండు రోజులు ఆఫీసుకు సెలవు పెట్టి ఇంట్లోనే ఒంటరిగా ఏడుస్తూ ఉండిపొయింది...ఏందుకో ఆక్షనాన చనిపోదమనుకోని తల్లికి ఆసరాగా ఉండాల్సిన తను ఇలాంటి నిర్నయం తప్పు అని తమాయించుకోని తనకు తానే దైర్యం తెచ్చుకోని ఆఫీసుకు వెళ్ళింది సదరు పెద్దమనిషి అంతకు ముందు ఏమీ జరగనట్టే ఎమైంది అలాఉన్నావు అంటూ అందరిముందు పెద్దమనిషి తరహాలో మాట్లాడుతుంటే మనుష్యుల మీద అసహ్యింవేసింది మదురిమకు .....
( మధురిమ రియల్ ష్టోరి మిగతా ష్టోరి ...తరువాత ఫోష్టులో పెడతాను ... ఎన్నోనిజాలు ప్రత్యెక్షంగా తెల్సుకున్ననేను ఇప్పుడు ఇంత కంటే చెప్పలేకపోతున్నా )