Friday, April 15, 2011
స్నేహం,ప్రేమ...మోసం,ద్వేషం..అన్నీ రెండు అక్షరాలే
స్నేహం,ప్రేమ...మోసం,ద్వేషం..అన్నీ రెండు అక్షరాలే ..
ఈ రెండు అక్షరాలు మనసుల్లో ఎంత ఆదోళన్ చేస్తాయోకదా..
ఆ రెండు అక్షరాలను అంత పదునుంది అన్నీ కత్తుల్లంటివే..
స్నేహం ప్రేమ ఇవిరెండూ మనకు తెలియకుండానే ఇద్దరి మనుష్యుల్ని దగ్గర చేస్తాయి..
ఇవి రెండూ ఉన్నంత వరకు ఇద్దరి మనుష్యుల్లో చెప్పలేని ఆనందం..
ఓకరికి ఒకరు తోడుగా ప్రపంచంతో సంబందం లేకుండా రెండు మనసులు ఎన్నో ఊసులాడు కుంటాయి..
ప్రతిక్షనం ఒకరికోసం ఒకరు అన్నట్టు బ్రతుకుతారు ఒకే ప్రాణంగా
ప్రతిక్షనం ఒకరికోసం ఒకరు అన్నట్టు బ్రతుకుతారు ఒకే ప్రాణంగా..
ఇద్దర్ని ఎలా విడదీయాలాని అనేక ప్లాన్లు వేస్తుంది..వీరి ప్రేమ మందు వాడు ఓడీపోతాడు
కాని చివరకు కాలం గెలుస్తుంది వీరిమద్యి మోసం ,ద్వేషం అనేవి పెట్టి దూరం చేస్తాడు..
శాడిష్టులా ఇద్దర్నీ విడదీసి ఆనందం పొందుతుంది కాలం ఎంత అన్యాయంకదా
ఈ ఘోరాన్ని తట్టుకోలేని రెండు మనసుల్లోని ఓ మనస్సు తనువు చాలిస్తుంది..
రెండు మనస్సులు ఆనందగా ఉండటం తట్టుకోలేని కాలాన్ని ఏమనాలి..
వింత ఏమిటంటే సంతోషపెట్టేవి రెండు అక్షరాలే దగ్గరచేసేవి రెండు అక్షరాలే..దూరం చేసేవి అవే రెండు అక్షరాలే..?..?
Labels:
కవితలు