Wednesday, April 27, 2011
నీవే కాదు..కన్నీళ్ళు కూడా కారనం చెప్పనంటున్నాయి..
ప్రపంచం అంతా నిదుర పోయే నిశీది రాత్రి వేళ..
కోట్లాది గుండెలు ఏకమై ఆనందపు అంచులు చూస్తున్నరాత్రి వేళ
వేలాది హృదయాలు ఊసులాడుకుంటున్న రాత్రి వేళ
నేను మాత్రం ఒంటరిగా..నీ కోసం ఆలోచిస్తూ
లోకాన్ని సంచరిస్తుంటా..నీ ఊహలతో
నిజాన్ని ఎప్పుడో దాటిపోయాను...అంతా ఉహే అనితేలింది..
వాస్తం ఎప్పుడో..దారితప్పింది..మౌనమే మిగిలింది..
నీవే కాదు..కన్నీళ్ళు కూడా కారనం చెప్పనంటున్నాయి..
నీవు మాత్రం ఏమాత్రం ఆలోచనలు లేకున్నావా..
నేను గుర్తున్నాన్నా..గుర్తుకొస్తానాఅని అప్పుడప్పుడూ నవ్వుకుంటాను వేదనగా.
నేను నీవు గుర్తుకొస్తున్నప్రతిసారి కన్నీళ్ళతో సదానం చెప్పుకుంటున్నా నా మనస్సుకు..
మనస్సు ఎన్ని సార్ల నమ్ముతుంది అన్నీ నిజాలని...అదికుడా నన్ను నమ్మడం మానేసింది..
అందుకే మనుషులకు దూరంగా పోవాలని చూస్తున్నా..వెల్తున్నా ఈరోజే..
కాలం కావలనుకుంటే మళ్ళీ వస్తా లేదంటే ఇక నీవు చూడాలనుకున్నా కనిపించను..GUD BYEE
Labels:
కవితలు