మృత్యువుతో పోరాడుతున్న క్షణం లో నీ పలుకుల కోసం తపించాను
నీ మాటల తియ్యదనం తో ఐనా చావుని చావునుంచి బ్రతికిస్తావో అని ...
నా మరణ శయ్య పై పుష్ప గుచ్చాన్ని ఉంచుతావని ఆరాటపడ్డాను
నీ చేతి స్పర్సతో ఐనా పునరుజ్జీవుడను అవుతానేమో అని ...
చితిలో కాలే క్షణం లో కూడా నీ వైపు నిస్తేజం గా చూసాను
నీ కన్నీటితో నా చితి మంటలను ఆర్పెస్తావేమో అని ...
మనసున్న నీవు ఇలా ఎందుకు మారావో అర్దంకావడంలేదు
లేని నీ హృదయాన్ని కోరిన నేరానికి నాకిలా జరగాల్సిందే కదా
ఇక ఎప్పటికీ తిరిగిరాని మృత్యువు ఒడిలో హాయి గా సేద తీరబోతున్న తరుణం ఆసన్నమైంది
....... ఇట్లు
........నీకెప్పటికి ఏమి కాలేని ..