Friday, April 22, 2011
అంత ప్రేమగా ఎలాఉంటారో..ఒకరినొకరు వీడలేనంతగా..?
అంత ప్రేమగా ఎలాఉంటారో..ఒకరినొకరు వీడలేనంతగా..?
ఇష్టపడటం దూరం కావడం అన్నీ ఎందుకో..ఇష్టపడి ఎందుకు దూరం అవుతారో
వాళ్ళిద్దరి మద్యి ఎలాంటి గొడవలేక పోయినా..ఎవరో చెప్పీందానికి ఇద్దరూ దూరం అవ్వడం..
ఎవ్వరూ పూడ్చలేనంత అఘాదం ఏర్పడటం..మంచి మిత్రులు శత్రువులు అవ్వడం.?
అంతా వింతగా వరుసగా జరిగిన పరిస్థితు గుర్తుకొచ్చినప్పుడల్లా..కంట కన్నీరు ఆగదు..
శత్రువుల్లా ఎంటాడుతున్న నీజ్ఞాపకాలు..ప్రతిక్షనం గుండెల్లో ఆవేదన మిగులుస్తాయి..
ఒకరిని ఒకరు విడువలేనంత గా ఎలా ఉంటారు..అలాఉండే వాళ్ళందరూ నిజంగానే అలా ఉంటున్నారా..
ఒకరిని ఒకరు క్షనం కూడా విడిచి ఉండలేనంత ప్రేమ ఒక్కసారిగా మారిపోతుందా ..ఎందుకలా జరుగుతుంది
ఏంటో అన్ని తిక్క తిక్క ఆలోచనలు..నిజాలు కాని నిజాలు అంటే ఇవేనేమో..
అందుకే అనిపిస్తుంది ...ఎన్ని అనుకున్నా గతం తిరిగి రాదు..వాస్తవం అబద్దం కాదు..
నిజం మింగుడు పడకా..వాస్తవాన్ని మర్చిపోలేక..జరుతున్నది తట్టుకోలేక..
మనం భాద పడుతూ మనసుని భాదపెడుతూ...కన్నీళ్ళతో సహవాసం చేయాల్సిందేనా..
నీవు నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు..గట్టిగా ఊపిరి పీలుస్తాను
ఆఊపిరి అలాగే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది నిజంగా...
ఎన్నాల్లని తట్టుకుంటాను నీవు లేనన్న వాస్తవాన్ని ప్రియా..
అందుకే కొన్ని సార్లు ఉన్న కన్నీరు ఆగిపోయి ..కన్నీరు బదులు రక్తం వస్తోంద్ తెలుసా..?
Labels:
కవితలు