Wednesday, April 20, 2011
నా కవిత నీ కోసమే పుట్టింది తెలుసా...?
నీవు దూరం అయినప్పటి నుంచి నేను చేస్తున్నది ఇదే
అక్షరాలతో సహవాసం
ఎంత అదృష్టమో కదా !
మాటలతో చెలిమి దూరం అయినప్పుడు
మనసును ఆవిష్కరించే కుంచె కవిత కదా !
నా కవిత నీ కోసమే పుట్టింది తెలుసా...?!
గొప్ప కోసం వ్రాయడం లేదు
మనసు లోని భావాలు ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నా
ఎవరి మెప్పు కోసమూవ్రాయడం లేదు
ప్రాసల ప్రయాసల కొఱకువ్రాయడం లేదు
ఆలోచన నన్ను నిలువనీయనపుడూ
దుక్కం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసినపుడూ
సంవేదన నా గుండెను మెలిపెట్టినపుడూ
మనస్సులో మథనం జరిగితేనే కదా !
పదాలు అమరిక..భాదతో నీడిపోతుంది
ఆత్మ తృప్తి కొఱకు ,నీ పై నాప్రేమను తెలిపేందుకు
ఆవేదన పంచుకోవటానికి
ఆలోచనల పదును పెంచటానికి
ఇలా నిన్ను గురించి ఆలోచనలు నన్ను వెంటాడుతున్నప్పుడు
ఇలా నీకోసం ఆలోచిస్తూ.. రాస్తుంటాను
Labels:
కవితలు