Wednesday, April 27, 2011
మళ్ళీ తిరిగి రాకూడదనే పోతున్నా...?
స్వప్నమైనా ఆనందమే నువు కనిపిస్తానంటేనే...
చావైనా సంతోషమే నువు కరునిస్తానంటేనే...
గాయమైనా ఉత్సాహమే నువు దరికొస్తానంటే...
ఓటమైనా విజయమే నీ స్నేహం పంచిస్తానంటే...
చెప్పలేని బాధైనా సుఖమే నీ మదిలో చోటిస్తానంటే...
గుచ్చుకునే ముళ్లైనా పూలదారులే నను నీవు ఆహ్వానిస్తానంటేనే...
కానీ... అమృతమైనా విషమే నువు నన్ను కాదంటానంటే...
స్వర్గ సుఖమైనా నాకు నరకమే నను నువ్వు ప్రేమించనంటే...
అందుకే చెలీ నా ప్రేమ రాజ్యంలో పట్టపురాణివై నను కరుణించు...
ఇన్నాళ్లుగా నీకోసం వేచి ఉన్న నా మదిలో సంతోషాన్ని రగిలించు ప్లీజ్..
ఇవన్నీ జరగవు అని తెల్సుకాని ...జరిగే అవకాశం అస్సలు లేదని కూడా తెల్సు..
కాని మనసు మాటవినదు గతాన్ని తవ్వి అలా ఎందుకు మళ్ళీ ఉండరు అని చెబుతోంది..
నాకెందుకో భాదగా ఉంది దూరం అవుతున్నా....కనిపించకుండా పోతున్నా అని..
అవును నీకు ఎదొ సమయంలో ఒక్కసారైనా గుర్తుకు వస్తానా....
మళ్ళీ తిరిగి రాకూడదనే పోతున్నా...మళ్ళీ రావడం అంటూ జరిగితే అది నీకోసం మాత్రమే..
నీ మౌనాన్ని నేను భరించలేకే ఈ నిర్నయం తీసుకున్నా అది నీకుతెల్సు కాని...?.
ఎదైనా దైర్యంగా చెప్పేనీవు ఇలా ఎందుకు మారావో అర్దంకాక పిచ్చెక్కుతోంది..
నీ మౌనం వెనుక కారనం ఎంత వెతికినా దొరకడంలేదు..కారణం ఎంటి..
మనం మనంగా పాతరోజులు రావని గుర్తుకు వస్తుంటే ఆ భాద తట్టుకోలేక పోతున్నా...
అందుకే వెలుతున్నా ..వస్తానో రానోతెలీదు..వచ్చే అవకాశం లేదు..ఎందుకో రావాలని లేదు..?
Labels:
కవితలు